భారతదేశం, జూలై 30 -- ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే పండుగను జరుపుకుంటాం. ఈ ఆగస్టు 3వ తేదీ ఆదివారం స్నేహితుల దినోత్సవం రాబోతోంది. ఒకప్పుడు మనకు తెలియని మనుషులు, మన జీవితంలోకి అడుగుపెట్టి, రక్త సంబంధం కంటే గొప్ప బంధంగా మారతారు. కష్టసుఖాల్లో తోడుండి, ఒకరికొకరు అండగా నిలబడి, అలుపెరగని ప్రయాణంలో ఓదార్పునిచ్చే బలం స్నేహం. అలాంటి స్నేహానికి గుర్తింపుగా ఒక రోజు ఉండాలని ఆలోచించడమే ఫ్రెండ్‌షిప్‌ డే పుట్టుకకు కారణం.

నిజానికి, స్నేహితుల దినోత్సవం ఆలోచనకు చాలా దశాబ్దాల చరిత్ర ఉంది. 1930లో హాల్‌మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ మొదటిసారిగా ఫ్రెండ్‌షిప్ డేను ప్రతిపాదించారు. గ్రీటింగ్ కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహాన్ని చాటాలని ఆయన సూచించారు. అయితే, ఇది కేవలం వ్యాపార ఆలోచనగా భావించి మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేద...