భారతదేశం, జూన్ 15 -- తండ్రీ.. నిజానికి మనం తక్కువగా మాట్లాడే పదం. కానీ ఆయనపై అత్యంత లోతైన అనుభూతి ఉంటుంది. నాన్న తరచుగా చెమటతో తడిసిన దుస్తులలో కనిపిస్తారు. కానీ ఆయన కళ్ళలో మనం ఎదగాలి అనే కల ఎప్పుడూ ఉంటుంది. తండ్రి ప్రేమ మాటల్లో కాదు, ఆయన మన కోసం చేస్తున్న పోరాటంలో ప్రతిబింబిస్తుంది. నిజానికి ప్రతి ఒక్కరూ తల్లి ప్రేమను బాగా అనుభవించగలరు. కానీ తండ్రి అలా కాదు.. ఆయన తన బిడ్డతో తక్కువ సమయం గడుపుతాడు. నిరంతరం మన కోసమే ఆలోచిస్తాడు.

ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకొంటారు. ఈ సంవత్సరం జూన్ 15న ఫాదర్స్ డే వస్తుంది. ఈ రోజున మీ నాన్నగారిని సంతోషపెట్టాడానికి కింద ఇచ్చిన వాటితో శుభాకాంక్షలు చెప్పండి.

దేవుడు నాకు ఇచ్చిన బహుమతి నాన్న.. ఆయన లేకుంటే ఈ జీవితానికి అర్థమే లేదు.. హ్యాపీ ఫాదర్స్ డే!

తండ్రి పిల్లల కోసం ఎన్నో త్యాగాలు ...