Hyderabad, జూన్ 15 -- ఇవాళ ఆదివారం (జూన్ 15) ఇంటర్‌నేషనల్ ఫాదర్స్ డే 2025. ప్రతి ఒక్కరు తమ నాన్నకు ప్రేమతో విషెస్ తెలియజేస్తారు. ఇక తండ్రి ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. నాన్న ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, అనురాగం, ఎమోషన్ గురించి చెప్పడానికి ఎన్నో కథలు, ఉదాహారణలు ఉన్నాయి.

ఒక కొడుకుకు నిజమైన హీరో తండ్రి మాత్రమే. అందుకే ఆ తండ్రి హీరోయిజం గురించి చెప్పేలా ఎన్నో సినిమాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చాయి. వాటిలో ఒకటి తక్కువ, మరోటి ఎక్కువ అని చెప్పలేం. కానీ, చూసేందుకు వీలుగా ఉండే కొన్ని బెస్ట్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. తండ్రి ప్రేమ ఏంటో చూపించే ది బెస్ట్ 5 ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.

రీసెంట్‌గా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అనగనగా. ఈటీవీ విన్‌లో తెలుగులో అనగనగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. వ్యాస్, అత...