భారతదేశం, డిసెంబర్ 7 -- హోటళ్ళు, ఈవెంట్‌లకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ లేదా వాట్సాప్ ద్వారా ఫోటోకాపీని పంపించమని అడుగుతారు. వెరిఫికేషన్ కోసం దీనిని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. అయితే ఆధార్ సేఫ్టీ బలోపేతం చేయడానికి UIDAI కొత్త నియమాలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం హోటళ్ళు, ఈవెంట్ కంపెనీలు ఆధార్ ఫోటోకాపీలను తీసుకోవడానికి అనుమతి లేదు.

రిజిస్ట్రేషన్ తర్వాత హోటళ్లు, ఈవెంట్ సంస్థలు క్యూఆర్ స్కాన్ లేదా కొత్త యాప్‌ని ఉపయోగించి పేపర్‌లెస్‌గా వెరిఫికేషన్ చేయాలి. ఇది గోప్యత, డేటా భద్రతను మెరుగుపరుస్తుంది. చాలా మంది ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వాటిని ఎక్కడో పడేస్తుంటారు. దీని ద్వారా కస్టమర్లకు వివరాలు ఎవరి చేతికి వెళ్తాయో తెలియకుండా ఉంటుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కాగితం ఆధారిత ఆధార్ ధృవీకరణను తొలగించడానికి UIDAI పెద్ద మార్పును...