Hyderabad, మే 24 -- మీరు ఆఫీసు పని మీద బయటకి వెళ్లినప్పుడు లేదా సెలవుల్లో ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు హోటల్‌లో స్టే చేయడం సహజమే. హోటల్లో ఉండే మంచి వాతావరణం, ప్రశాంతమైన గది, వాళ్ళిచ్చే మంచి సేవలు అందరికీ నచ్చుతాయి. అయితే హోటల్ రూమ్‌లో ఉండే కొన్ని వస్తువులు మన కోసం మాత్రమేనని, వాటిని మనం ఇంటికి తీసుకెళ్లచ్చని మీకు తెలుసా? ఉంటాయని మీకు తెలుసా? అవును హోటల్ గదుల్లో ఉండే కొన్ని రకాల వస్తువులు మనం కడుతున్న అద్దెలో భాగంగా మనకు వాళ్లు ఇచ్చేవి. వాటిని మనం నిర్భయంగా ఇంటికి తీసుకెళ్లచ్చు.

చాలా మందికి ఈ విషయం తెలియక హోటల్ నుంచి వస్తువులను తీసుకెళ్లడం దొంగతనం అవుతుందేమో భయపడుతుంటారు. నిజం చెప్పాలంటే చాలా హోటల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్లకు మంచి అనుభూతి ఇవ్వడానికి కొన్ని చిన్న చిన్న వస్తువులు ఇస్తుంటాయి. వీటిని ఉపయోగించడం, ఇంటికి తీసుకెళ్లడం మన హ...