భారతదేశం, డిసెంబర్ 7 -- యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతిశెట్టి షాకింగ్ కామెంట్లు చేసింది. తన గదిలో ఆత్మ చూశానని చెప్పింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో కార్తి హీరోగా వస్తున్న వా వాతియర్ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. తెలుగులో ఇది అన్నగారు వస్తారు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కృతిశెట్టి ఆత్మలతో మాట్లాడే క్యారెక్టర్ ప్లే చేసింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ హీరోయిన్ కామెంట్లు వైరల్ గా మారాయి.

అన్నగారు వస్తారు మూవీ ప్రమోషన్లలో కృతిశెట్టి బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. ''అన్నగారు వస్తారు మూవీ షూటింగ్ కు ఒక రోజు ముందు రాత్రి అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నా. నాకు ఆత్మ లాంటి ఆకారం కనిపించింది. భయంతో లైట్ వేయగానే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ వెంటనే ఆత్మ మాయమైంది. అది ఎందుకు వచ్చిందో తెలియదు'' అని కృతిశెట్టి ...