భారతదేశం, జూలై 26 -- బీహార్ లోని బుద్ధ గయలో హోంగార్డు రిక్రూట్ మెంట్ లో భాగంగా నిర్వహించిన రేసులో పాల్గొన్న ఒక 26 ఏళ్ల యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ మహిళా అభ్యర్థిని ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లోనే అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ డ్రైవర్, టెక్నీషియన్ లను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను గయలోని ఉట్రేన్ గ్రామానికి చెందిన వినయ్ కుమార్, నలంద జిల్లాలోని చందన్ పూర్ గ్రామానికి చెందిన అజిత్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. వారిద్దరు అంబులెన్స్ సర్వీస్ లో ఉద్యోగులని పోలీసులు తెలిపారు. హోం గార్డ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో భాగంగా బుద్ధ గయలో మహిళా అభ్యర్థులకు రన్నింగ్ రేసు నిర్వహించారు. అక్కడ అత్యవసర పరిస్థితి ఎదురైతే సేవలను అందించడం కోసం ఒక అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు. ఆ రన్నింగ్ రేసుకు కేవల...