భారతదేశం, జనవరి 30 -- భారత మార్కెట్ కోసం హోండా సంస్థ డియో 125 స్కూటర్​లో సరికొత్త 'ఎక్స్​ ఎడిషన్'ను ఆవిష్కరించింది. తన 125 సీసీ స్కూటర్ లైనప్‌కు మరింత మెరుగులు దిద్దుతూ, సరికొత్త హంగులతో దీనిని తీసుకొచ్చింది. అయితే, ఈ అప్‌డేట్ కేవలం బాహ్య రూపానికి సంబంధించినది మాత్రమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డియో 125 మోడల్‌కు స్టైల్‌ను జోడించి ఈ వేరియంట్‌ను రూపొందించారు. ఇందులో మెకానికల్ లేదా హార్డ్‌వేర్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ హోండా డియో 125 ఎక్స్​ ఎడిషన్​ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ హోండా డియో 125 ఎక్స్​ ఎడిషన్ స్కూటర్‌లో డ్యూయల్-టోన్ బాడీ ప్యానెల్స్, సరికొత్త గ్రాఫిక్స్, ప్రత్యేకమైన 'ఎక్స్​ ఎడిషన్' డీకాల్స్ (స్టిక్కర్లు) ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి...