భారతదేశం, మే 30 -- హోండా తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను తీసుకొచ్చింది. చైనా మార్కెట్‌లో ఈ-విఓను ఆవిష్కరించింది. చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఈ మోటార్ సైకిల్‌ను స్థానిక కంపెనీ సహకారంతో తయారు చేశారు. దీని ధర మార్కెట్లో సుమారు రూ .3.56 నుండి 4.39 లక్షల మధ్య ఉంటుంది. హోండా ఈ-విఓ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బైక్‌ను భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉందో లేదో తెలియాలి.

హోండా ఈ-విఓ 16-అంగుళాల ముందు, 14-అంగుళాల వెనుక చక్రాలతో సెమీ-స్లిక్ టైర్లను కలిగి ఉంది. దీని బరువు 143 కిలోలు, వివిధ వేరియంట్లలో 156 కిలోల వరకు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది.

బ్లాక్ అండ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో తీసుకోవచ్...