భారతదేశం, జనవరి 5 -- భారతదేశంలో టూ-వీలర్ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు 'హోండా'! పెట్రోల్ స్కూటర్ల విభాగంలో యాక్టివాతో రారాజుగా వెలుగుతున్న హోండాకు, ఎలక్ట్రిక్ విభాగం (ఈవీ) మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కంపెనీకి చెందిన యాక్టివా:ఇ, 'క్యూసీ1' ఎలక్ట్రిక్​ స్కూటర్లు భారతీయ కస్టమర్లను మెప్పించలేకపోయాయి. దీనితో గత కొన్ని నెలల క్రితమే వాటి ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థ, ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగానే ఒక కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ని తీసుకొస్తోంది.

గతంలో హోండా తెచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అంటే.. ధర ఎక్కువగా ఉండటం, బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ తక్కువగా ఉండటం, సీటు కింద స్టోరేజ్ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు వల్లే అనే ఆటో పరిశ్రమ చెబుతోంది.

ఈ సెగ్మెంట్​లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా వంటి ...