భారతదేశం, నవంబర్ 23 -- హోండా మోటార్‌సైకిల్స్ అండ్​ స్కూటర్స్ ఇండియా (హెచ్​ఎంఎస్​ఐ) ఈ సంవత్సరం ప్రారంభంలో 'యాక్టివా ఈ', 'క్యూసీ1' మోడళ్లను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. జపాన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన లభిస్తుందని అందరూ భావించారు. కానీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ డేటా మాత్రం అందుకు భిన్నమైన విషయాన్ని సూచిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హోండా ఆగస్టు 2025 నుంచి ఈ రెండు మోడళ్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేసింది!

ఫిబ్రవరి నుంచి జులై 2025 వరకు హోండా మొత్తం 11,168 యాక్టివా ఈ, క్యూసీ1 ఎలక్ట్రిక్​ స్కూటర్లకు చెందిన యూనిట్లను తయారు చేసింది. అయితే డీలర్లకు కేవలం 5,201 యూనిట్లు (46.6 శాతం) మాత్రమే పంపిణీ అయ్యాయి. దీనితో కంపెనీ వద్ద పెద్ద మొత్తంలో అమ్ముడుపోని...