భారతదేశం, జూలై 12 -- ఇటీవలే లాంచ్​ అయిన నథింగ్​ ఫోన్​ 3పై స్మార్ట్​ఫోన్​ ప్రియుల్లో ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఫ్లాగ్​షిప్​ మోడల్​ కొనాలా? వద్దా? ఇది వాల్యూ బయ్యింగ్​ అవుతుందా? లేదా? అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నథింగ్​ ఫోన్​ 3కి ప్రధాన పోటీదారు అయిన శాంసంగ్​ గెలాక్సీ ఎస్​25 తో పోల్చి, ఈ రెండింటిలో ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

నథింగ్ ఫోన్ 3 రేర్​ ప్యానెల్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నథింగ్ కంపెనీ ట్రాన్స్​పరెంట్​ డిజైన్‌తో పాటు కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్, హాప్టిక్ బటన్, ట్రిపుల్ కెమెరా సెటప్, కొత్త రికార్డింగ్ లైట్ వంటివి దీనికి సరికొత్త లుక్‌ని ఇస్తాయి. ఇది ఐపీ68 రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది కాబట్టి మన్నిక విషయంలో ఆందోళన అవసరం లేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్​25 స్మా...