Hyderabad, మే 18 -- హైబీపీ చాలా డేంజర్ అని చాలా మంది అనుకుంటారు. నిజానికి లోబీపీ కూడా ప్రమాదకరమైనదే. మీ రక్తపోటు తక్కువగా ఉంటే అది మరణానికి దారితీస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు. తక్కువ రక్తపోటు అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా నివారించాలి? అనే విషయాలు తెలుసుకోండి.

తక్కువ రక్తపోటు లేదా లోబీపీ అనేది ధమనుల గోడలకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తక్కువగా ఉందని అర్థం. దీనిని హైపోటెన్షన్ అని కూడా అంటారు. రక్తపోటును మిల్లీమీటర్ పాదరసం (మిమీ Hg) లో కొలుస్తారు. 90/60 mm Hg కంటే తక్కువ ఉన్న పరిస్థితిని తక్కువ రక్తపోటుగా పరిగణిస్తారు. రక్తపోటు తక్కువగా ఉన్నప్పటికీ నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితి ఉన్నవారిలో మైకము, మూర్ఛకు దారితీస్తుంది. కొన్నిసార్లు తక్కువ రక్తపోటు కారణంగా మరణం సంభవించవచ్చు.

డీహైడ్రేషన్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమ...