భారతదేశం, డిసెంబర్ 31 -- రానున్న సంక్రాంతి వేళ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోజుకు లక్ష వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించింది. ఇదే విషయంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముఖ్యంగా టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఉంటుందని.. ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనదారుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఇక హైవేపై ట్రాఫిక్ జామ్ లను నివారించడానికి టోల్ ...