భారతదేశం, జనవరి 10 -- సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావటంతో. చాలా మంది నగరం నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది.

గత రెండు రోజులుగా విజయవాడ - హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ. ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్‌ పట్టణంతో పాటు పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది.

మరోవైపు ఈ హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలతో. అధికారులు,పోలీసులు వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఉ...