భారతదేశం, ఏప్రిల్ 26 -- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దేశవ్యాప్తంగా 21 ఉత్పత్తి/ఓవర్‌హాల్/సర్వీస్ విభాగాలు, 9 R&D కేంద్రాలు, 1 ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ విభాగంతో ఒక ప్రధాన ఏరోనాటికల్ పరిశ్రమగా ఉంది. హెచ్ఏఎల్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, ఏరో-ఇంజిన్లు, ఇండస్ట్రియల్ మెరైన్ గ్యాస్ టర్బైన్‌లు, ఏవియానిక్స్ & సిస్టమ్స్, ఉపగ్రహ & ప్రయోగ వాహనాల కోసం నిర్మాణాత్మక భాగాలు తయారుచేస్తుంది.

హైదరాబాద్‌ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లోని ఏవియానిక్స్ డివిజన్ లో నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో డిప్లొమా టెక్నీషియన్‌గా నాలుగు సంవత్సరాల కాలానికి తాత్కాలికంగా పనిచేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు మే 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టుల...