భారతదేశం, ఫిబ్రవరి 10 -- హైదరాబాద్‌లోని మెషిన్ టూల్స్ లిమిటెడ్(HMT) తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఆఫీసర్ (ఫైనాన్స్) 1, ఆఫీసర్(లీగల్) 1 ఉద్యోగాలు ఉన్నాయి. రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. ఎంపికైన వ్యక్తుల పనితీరు ఆధారంగా మరో రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు.

ఆఫీసర్ ఫైనాన్స్ ఉద్యోగానికి అప్లై చేసేవారు సంబంధిత రంగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఖాతాల నిర్వహణ / ఆడిట్ / పన్నులు / ఖర్చు, బడ్జెట్ మొదలైన వాటిలో ప్రత్యేక అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అకౌంటింగ్ కార్యకలాపాలను నిర్వహించడం, బడ్జెట్, ఆర్థిక వంటి ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలి. బ్యాలెన్...