భారతదేశం, డిసెంబర్ 21 -- యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ లో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. డిసెంబర్ 23వ తేదీతో గడువు ముగుస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 4 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ప్రతిభ కనబర్చిన వారిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. రూ.27,000 స్టైఫండ్ చెల్లిస్తారు. https://uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....