భారతదేశం, మే 3 -- హైదరాబాద్-విజయవాడ మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన...మోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందన్నారు. గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల నుంచి జాతీయ రహదారులు వెళ్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు. రహదారుల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమైనదని చెప్పారు. అందుకే వాజ్‌పేయీ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం 'స్వర్ణ చతుర్భుజి' పథకాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. 2004లో అధికారకాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని రద్దు చేసిందన్నారు.

"2014లో తెలంగాణలో 2,500 కి.మీ మేర జాతీయ రహదారులు ఉంటే... పదేళ్ల తర్వాత 5,200 కిలోమీటర్ల...