భారతదేశం, జనవరి 2 -- హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అలర్ట్ ఇచ్చింది. సిటీకి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలో పైప్ లీకేజీ ఏర్పడింది. శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి వద్ద 3000 మీమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌ కి ఏర్పడిన లీకేజీతో వాటర్ సరఫరాకు బ్రేక్ పడిందని అధికారులు తెలిపారు.

పైప్ లీకేజీ కారణంతో 02.01.2026 శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి మరునాడు 03.01.2026 (శనివారం) ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా బంద్ కానుంది. మొత్తం 19 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 19 గంటలు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

1. ఓ అండ్ ఏం డివిజన్-VI: ఎస్.ఆర్. నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగల్‌రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ ...