భారతదేశం, మే 13 -- హైదరాబాద్ నగరంలో మరో రెండు రైల్వేస్టేషన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. చర్లపల్లి- మౌలాలి- బొల్లారం మార్గంలో కొత్తగా నిర్మించిన ఆర్కేనగర్, దయానంద్‌నగర్‌ రైల్వేస్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా.. దయానంద్‌నగర్, ఆర్కే నగర్‌లో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌.. వీటిని పరిశీలించారు. పలు సూచనలు చేశారు.

ఈ రైల్వేస్టేషన్లు అందుబాటులోకి వచ్చాక.. ఆర్కేనగర్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేలా ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇందుకోసం 21 కోచ్‌లకు సరిపడా ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తున్నట్టు చెప్పారు. అయితే.. ఈ రైలుతో పాటు ఆదిలాబాద్‌- తిరుపతి, విశాఖపట్నం - నాందేడ్, నర్సాపూర్‌ - నాగర్‌సోల్, విశాఖపట్నం - షిర్డీ సాయినగర్, నాగావళి సూప...