భారతదేశం, ఏప్రిల్ 27 -- పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు సంకల్పించింది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భోజనాలు కూడా చేశారు. కానీ.. హైదరాబాద్‌లో మాత్రం ఇంతవరకు ఈ పథకం అమలు జరగలేదు. అందుకు కారణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.

మొన్నటిదాకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా.. నగరవాసులకు ఇన్నిరోజులు సన్నబియ్యం అందలేదు. అయితే ఏప్రిల్ 25వ తేదీ నాటికి ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో భాగ్యనగరంలోనూ సన్న బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గోదాముల నుంచి 653 రేషన్ షాపులకు సన్న బియ్యాన్ని చేరవేసే పనులు మొదలు పెట్టారు. మే 1 నుంచి నగరంలోని రేషన్ షాపుల ద్వారా అర్హులైన అందరికీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.

ఈ పథ...