భారతదేశం, డిసెంబర్ 25 -- హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అలర్ట్ ఇచ్చింది. కృష్ణా ఫేజ్ - 1లో జరిగే మరమ్మత్తు పనుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 27 ఉదయం నుంచి 28వ తేదీ సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని HMWSSB ప్రకటించింది.

జలమండలి ప్రకటించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సిటీకి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్ - 1 లో సర్జ్ ట్యాంక్ వద్ద ఉన్న 700 మిమీ డయా ఎంఎస్ పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీని అరికట్టే పనులు జరగనున్నాయి. అంతేకాకుండా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వులను మార్పిడి చేస్తారు. నాసర్లపల్లి వద్ద 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై 600 మిమీ డయా ఎంఎస్ జంక్షన్ పనులు చేపట్టడంతో పాటు కోదండాపూర్, నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలో ...