భారతదేశం, జూన్ 16 -- భారీ స్థాయిలో సినిమాలు తీయడంలో దిట్టగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే ప్రతి ప్రాజెక్టుతో గ్రాండియర్ను మరో మెట్టు ఎక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో కెన్యాలో ప్రారంభం కానుంది.

రాజమౌళి, మహేష్ బాబు సినిమాలోని ఓ కీలక ఘట్టం వారణాసిలో జరుగుతుందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రియల్ లొకేషన్ లో షూట్ చేయడం కష్టం కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసిలోని కీలక భాగాన్ని నిర్మించాలని రాజమౌళి తన టీంను కోరారట. సెట్ వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. ఇప్పటికే ఈ భారీ సెట్...