భారతదేశం, మే 10 -- హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసులు శుక్రవారం ఓ డ్రగ్స్ రాకెట్ లో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్న సమయంలో ఓ యువతి, డ్రగ్స్ కొరియర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యుడి కుమార్తె...ఆమె కూడా స్వయంగా వైద్యురాలు. డాక్టర్ గా ఎంతో బాగా పని చేస్తూ డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఇలాంటి డాక్టర్ డ్రగ్స్ కు బానిస అయ్యారు. కేవలం డ్రగ్స్ కోసమే ఇప్పటి వరకు రూ.70 లక్షలు ఖర్చు చేశారని పోలీసులు గుర్తించారు.

ముంబయిలోని ఓ పబ్ లో పరిచయమైన వ్యక్తితో డ్రగ్స్ అలవాటు చేసుకున్న ఆమె...డ్రగ్స్ కు బానిసగా మారిపోయింది. ఏడాదిలో రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసి వాడేసినట్లు పోలీసులు అంటున్నారు. పోలీసులు అరెస్టు చేసిన సమయంలో రూ...