భారతదేశం, మే 10 -- హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మిస్ వరల్డ్-2025 ప్రారంభం కార్యక్రమాలు నిర్వహించారు. అందె శ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయ్యాయి. 250 మంది కళాకారులతో కన్నుల పండుగగా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీల్లో వెయ్యి మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు.

మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల కంటెస్టెంట్స్ పాల్గొనున్నారు. స్టేడియం, కంటెస్టెంట్‌లు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....