Telangana,hyderabad, ఆగస్టు 24 -- హైదరాబాద్ నగర పరిధిలో కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నారా..? అయితే మీకు జలమండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్ లైన్ లోనే వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రం పొందే సేవలను ప్రారంభించింది. దీంతో నూతన భవన నిర్మాణదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నూతన భవనం నిర్మించాలంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ తప్పనిసరి. ఆ పర్మిషన్ కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజిబిలిటీ తో పాటు జలమండలి జారీ చేసే వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రం సమర్పించాలి.

గతంలో ఈ సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో, తర్వాత ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో సీజీఎం జారీ చేసేవారు. వివిధ కారణాల రీత్యా ఈ ప్రక్రియలో జాప్యం జరిగేది. దీన్ని నివారించి, ఆ ప్రక్రియను సులభతరం చేయడానికి ధ్రువపత్రాల జారీని ఆన్‌లైన్‌ లోనే పొందేలాగా మార్పులు చేశారు.

Pub...