భారతదేశం, అక్టోబర్ 26 -- హైదరాబాద్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి.సెల్‌ఫోన్‌ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు పోలీసులపైనే దాడికి యత్నించారు. కత్తితో పొడిచే ప్రయత్నం చేయగా. ఈ క్రమంలోనే డీసీపీ చైతన్య కుమార్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నిందితుడు గాయపడగా.. మరో స్నాచర్ తప్పించుకున్నాడు. ఈ ఘటన అటు పోలీస్ శాఖతో పాటు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చాదర్‌ఘాట్‌ విక్టరీ ప్లే గ్రౌండ్‌ వద్ద ఈ కాల్పులు జరిగాయి. శనివారం సాయంత్రం ఆగిన ఆటోలోని ప్రయాణికుల నుంచి ఇద్దరు స్నాచర్లు సెల్‌ఫోన్లు కొట్టేసేందుకు ప్రయత్నించారు. ఇదే దారిలో కారులో వెళ్తున్న సౌత్‌ఈస్ట్‌ డీసీపీ చైతన్యకుమార్‌ వీరి వ్యవహారాన్ని గమనించాడు. గన్ మెన్ తో కలిసి పట్టుకునేందుకు యత్నించారు. ఇందులో మహ్మద్‌ ఒమర్‌ అన్సారీ అనే నిందితుడు వారిపై ఎదురుదాడికి దిగాడు.

తన వద్ద ఉన్...