Telangana,hyderabad, సెప్టెంబర్ 26 -- అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇక హైదరాబాద్‌ నగరంలో గురువారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇవాళ ఉదయం కూడా భారీగానే వర్షం పడింది.

ఇవాళ హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా ఐటీ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

వాతావరణ శాఖ వెదర్ బులెటిన్ ప్రకారం.. శుక్ర, శనివారాల్లో నగరంలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన గాలులతో పాటు ఈదురు గాలులు (40 నుండి 50 ...