భారతదేశం, జనవరి 3 -- హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో శనివారం ఈగల్ టీమ్ ప్రత్యేక సోదాలను నిర్వహించింది.కొంతమంది వ్యక్తులు గంజాయి(డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు సమాచారం అందటంతో. ఓ విల్లాను తనిఖీ చేశారు.

ఈగల్ టీమ్ సోదాల్లో అక్కడ ముగ్గురు వ్యక్తులను దొరికారు. అయితే వీరిలో ఏపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి కూడా ఉన్నాడు. అతడు మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు గుర్తించారు. అయితే మిగతా ఇద్దరికి నెగెటివ్ వచ్చింది.

సుధీర్ రెడ్డి గంజాయి వినియోగదారుడిగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. "అతను వినియోగదారుడు కాబట్టి.. మేము అతని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తాము" అని సదరు అధికారి చెప్పారు.

ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ఎమ్మ...