భారతదేశం, ఏప్రిల్ 21 -- దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ సోమవారం ప్రారంభించింది. ఐకామ్ సమీకృత ఇంజినీరింగ్ విభాగం ఆవరణలో ఈ ఆయుధ తయారీ కేంద్రాన్ని ఐకామ్ టెలీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు, క్యారకల్ సీఈఓ హమద్ అల్ అమెరి సంయుక్తంగా ప్రారంభించారు.

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఇక్కడ తయారయ్యే ఆయుధాలు భారత సాయుధ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( సీఏపీఎఫ్ఎస్ ), సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు, ఎస్పీజీ వంటి సంస్థల కీలక అవసరాలను తీరుస్తాయి. అలాగే క్యారకల్ సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాలకు ఆయుధాల్ని ఎగుమతి చేసేందుకు హైదరాబాద్ లోని ఆయుధ తయారీ కేంద్రం ఉపయోగపడుతుంది. యూఏఈ సంస్థ భారత దేశానికి ...