భారతదేశం, మే 13 -- ఏపీలో కొత్తగా తీసుకు వచ్చిన ఎక్సైజ్ పాలసీతో ఆదాయంలో వృద్ధి నమోదైనా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో 2024-25లో రాష్ట్రానికి ఎక్సైజ్ ఆదాయం రూ.28,842 కోట్లు వచ్చిందని అంతకుముందు ఏడాది కన్నా 14.84 శాతం ఎక్కువైనా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకతో పోల్చుకుంటే ఏపీలో ఎక్సైజ్ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉందని సీఎం కామెంట్‌ చేశారు.

2025-26 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి రూ.2,116 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ద్వారా రూ.33,882 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని...మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెం...