భారతదేశం, మే 15 -- హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ధరల షాక్ తగిలింది. మెట్రో సంస్థ టికెట్ ధరలను పెంచింది. ఛార్జీల్లో పెంపు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు పెంచుతున్నట్లు మెట్రో ప్రకటించింది.

హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తూ మెట్రో నియమించారు. దీంతో ఉద్యోగ, వ్యాపారస్తులు సకాలంలో తమ కార్యకలాపాలు సాగించేందుకు ఎక్కువగా మెట్రో సేవలను వినియోగించుకుంటారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, నాగోలు నుంచి రాయదుర్గం వరకు ప్రయాణించే ఈ మెట్రో రైలులో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తుంటారు.

మెట్రో నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఛార్జీల పెంపు ప్రతిపాదన గతంలోనే రాగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో గతంలో ఛార్జీల పెంపు ప్రతిపాదనను మెట్రో రైలు విరమించు...