భారతదేశం, నవంబర్ 27 -- ఐఆర్సీటీసీ టూరిజం నుంచి పలు రకాల ప్యాకేజీలు వస్తున్నాయి. వీటిలో అధ్యాత్మికం, పర్యాటకం వంటి ప్రాంతాలుంటున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా దర్శనంతో పాటు నాసిక్ చూసేందుకు ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది.

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ 5 డిసెంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. సాయి శివమ్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 8,840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7470,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7450గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.

స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే. సింగిల్ షేరింగ్ కు రూ. 7170, డబుల్ షేరింగ్ కు రూ. 5790, ట్రిపుల్ షేరిం...