Andhra,hyderabad, జూన్ 3 -- ఐఆర్సీటీసీ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అయితే కొత్తగా హైదరాబాద్ నుంచి మరో ప్యాకేజీని ప్రకటించింది. గోదావరి టెంపుల్ టూర్ పేరుతో ఆపరేట్ చేయనుంది.

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కోనసీమలోని ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు చూడొచ్చు. అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం వంటి ఆలయాలను దర్శించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ జూన్ 13వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చూడాలి.

లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 08.30 గంటలకు, సికింద్రాబాద్ నుంచి అయితే 9.15 గంటలకు గౌతమి ఎక్స్ ప్రెస్(ట్రైన్ నెంబర్ 12738) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. ఉదయం 4,38 గంటలకు రాజమండ...