భారతదేశం, నవంబర్ 16 -- ఐఆర్సీటీసీ టూరిజం వేర్వురు ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అయితే కొత్తగా హైదరాబాద్ నుంచి మరో ప్యాకేజీని ప్రకటించింది. "గోదావరి టెంపుల్ టూర్" పేరుతో ఆపరేట్ చేయనుంది. ఇదే నెలలో జర్నీ ఉంటుంది.

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కోనసీమలోని ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు చూడొచ్చు. అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం వంటి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 15,340, డబుల్ షేరింగ్ కు రూ. 8940, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7170గా ఉంది. అదే స్టాండర్డ్ క్లాస్ లో అయితే ట్రిపుల్ షేరింగ్ కు రూ, 5630, డబుల్ షేరింగ్ కు రూ. 7400గా నిర్ణయించారు. ఇక సింగిల్ షేరింగ్ కు అయితే రూ. 13,800గా ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సంద...