Telangana,hyderabad, జూలై 18 -- హైదరాబాద్ లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఆదిభట్ల వద్ద ఓ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.

సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు వెలికి తీశారు. చందులాల్‌ (29), కావలి బాలరాజు (40),జనార్దన్‌ (50)తో పాటు జాడ కృష్ణ, దాసరి భాస్కరరావును మృతులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన గుగులోత్ జనార్ధన్.. గూడూరు మండల వాసిగా గుర్తించారు. జనార్ధన్ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మాజీ ఎంపీ మాలోతు కవిత సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప...