భారతదేశం, సెప్టెంబర్ 7 -- హైదరాబాద్ 7.5 కి.మీ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్‌ పనులను త్వరలో ప్రారంభించడానికి అవసరమైన అన్ని సాంకేతిక సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అవసరమైన రైట్ ఆఫ్ వే (RoW) దాదాపు అందుబాటులో ఉందని ప్రకటించారు.

ప్రభావిత ఆస్తుల సేకరణ, కూల్చివేత కీలక దశకు చేరుకుందని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రకటించింది. ప్రభావిత ఆస్తుల ప్రాథమిక అంచనా 1,100గా ఉన్నప్పటికీ వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాలతో ఆ సంఖ్యను 886కి తగ్గించాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 550 కి పైగా కూల్చివేతలు పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణాలను తొలగించే పని జరుగుతోం...