భారతదేశం, మే 20 -- హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. జీ ప్లస్ 2 బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు. జీ ప్లస్ 2 బిల్డింగ్ లోని.. సెకండ్ ఫ్లోర్ చెప్పుల గోదాం ఉంది. సరకును నిల్వ చేసుకుంటున్నారు ఆ ఫ్లోర్‌లో మంటలు వచ్చాయి. పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి.

స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అంతా రబ్బర్ కావటంతో ఆ ప్రాంతం అంతా నల్లటి పొగ కమ్మేసింది. ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించటంతో.. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం జరిగిన భవనం పక్కనే మరో బిల్డింగ్ కూడా ఉంది. మంటలు అదుపు చేయటం ఆలస్యం అయితే.. ప్రమాదం త...