Hyderabad,telangana, సెప్టెంబర్ 4 -- హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరించనున్నారు. ఇందుకోసం మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఐటీ కారిడార్ లో 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తున్నాయని గుర్తు చేశారు.

ఇటీవలే హైద‌రాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మ‌హీంద్ర క్యాంప‌స్‌లో ర‌వాణా సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై సాఫ్ట్వేర్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో మాట్లాడిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఐటీ కారిడార్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఉద్యోగులకు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఐటీ కంపెనీలకు అద్దెక...