భారతదేశం, డిసెంబర్ 6 -- శంషాబాద్ ఆర్జీఐ విమానాశ్రయంలో శనివారం కూడా గందరగోళం కొనసాగింది. విమానయాన సంస్థ మొత్తం 69 విమానాలను రద్దు చేసింది. శనివారం వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు వచ్చే 26 విమానాలు, హైదరాబాద్ నుండి వివిధ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన 43 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు విశాఖ నుంచి 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇందులో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌కు వెళ్లేవి ఉన్నాయి.

కార్యకలాపాలను సాధారణీకరించడం, సమయపాలనను తిరిగి తీసుకురావడం కాస్త కష్టమైన పనే అని అధికారులు చెబుతున్నారు. మరో పది రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయంటున్నారు. దిద్దుబాటు చర్యలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 10, 2026 నాటికి స్థిరమైన విమాన కార్యకలాపాలు పూర్తిగా పునరుద్ధరిస్తామని, రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని రద్...