భారతదేశం, జనవరి 26 -- హైదరాబాద్‌లో 2025లో షీ టీమ్స్ 1,149 ఫిర్యాదులను పరిష్కరించింది. వివిధ రకాల వేధింపులకు పాల్పడిన 3,826 మందిని అరెస్టు చేసినట్టుగా హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిజిటల్ బ్లాక్‌మెయిల్, సైబర్‌స్టాకింగ్, పబ్లిక్ ప్లేస్‌లో వేధింపులు వంటి నేరాలపై షీ టిమ్స్ స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రతి ఫిర్యాదును తీవ్రత, గోప్యతతో పరిశీలిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ అన్నారు.

పోలీసుల ప్రకారం, బ్లాక్‌మెయిల్ అత్యంత సాధారణ సైబర్ సంబంధిత నేరంగా ఉంది. ప్రైవేట్ ఛాయాచిత్రాలను లేదా రికార్డ్ చేసిన వీడియో కాల్‌లను దుర్వినియోగం చేస్తామని చాలా బెదిరిస్తున్నారు. నీ ప్రైవేట్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. నీతో దిగిన మీ ఫొటోలను మీ ఇంట్లో వాళ్లకు పంపిస్తాను అంటూ బెదిరించిన తర్వాత 366 మంది బాధితులు షీ టీమ్స్‌ను సంప్రదించారు.

బ్లాక్‌మెయిలింగ్ సమస...