భారతదేశం, జనవరి 4 -- కలుషిత నీరు సరఫరాతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. కలుషిత నీరు ఫిర్యాదులను 'జీరో'కు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జలమండలి ఎండీ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ప్రతినిత్యం కలుషిత నీరు ఫిర్యాదులు నమోదు అవుతాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి.. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే ఎం సీ సీ కి అందే కలుషిత నీరు ఫిర్యాదులు ఏయే ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయో చూడాలని సూచించారు. తరచూ నమోదవుతున్న ఫిర్యాదుల ప్రాంతాల వివరాలను సేకరించి సమస్య మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆద...