Telangana,hyderabad, జూలై 8 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్‎గా పని చేస్తున్న సుధా ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయారు.

ఏసీబీ అధికారుల ప్రకటన ప్రకారం. మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్‎గా పని చేస్తోన్న సుధా.. ఓ కంపెనీకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసింది. రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు.

ఫిర్యాదుదారుడి సమాచారం. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు. నాంపల్లిలోని గగన్ విహార్‎లో సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. సుధాపై కేస...