భారతదేశం, జనవరి 16 -- హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనలో అన్న ప్రాణాలు కోల్పోగా. తమ్ముడు అరెస్ట్ అయ్యాడు. భవనం పైనుంచి తోసేయటంతో ఈ ఘటన జరిగింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నివాసంలో ఉంటారు. సంక్రాంతి పండుగ వేళ బుధవారం అర్ధరాత్రి సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ తమ నివాసం ఉంటున్న భవనంపై మద్యం సేవించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం గ్లాస్ విషయంలో గొడవ జరిగింది. ఇది కాస్త మాట మాట పెరిగి పెద్దదిగా మారింది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు.. క్షణికావేశంలో తన అన్న రోహన్‌ను భవనం పైనుంచి కిందకు తోసేశాడు.

3 అంతస్తుల భవనంపై నుంచి కింద పడిపోయిన సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ...