Telangana,hyderabad, జూలై 10 -- హైదరాబాద్ లో ఆషాడ మాస బోనాలు జరుగుతున్నాయి. జూలై 13వ తేదీన ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కీలక ప్రకటన చేశారు. వైన్స్ షాపులు మూసివేసి ఉంటాయని తెలిపారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ షాపులు మూసి వేసి ఉంటాయని పోలీసులు తెలిపారు. జూలై 13 ఉదయం 6 గంటల నుంచి జూలై 15 ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.

గాంధీ నగర్, చిలకలగూడ, బేగంపేట్, గోపాల్ పురం, మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

వైన్స్ షాపులు మాత్రమే కాకుండా... కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేసి ఉంటాయని హైదరాబాద్ నగర సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే.. కఠిన చర్య...