Hyderabad,telangana, జూలై 27 -- ప్రస్తుత రోజుల్లో చాలా మంది సంతానం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ ,సరోగసి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ జంట సంతానం కోసం. హైదరాబాద్ లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించగా ఘోర తప్పిదం జరిగింది. పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయగా.. సంచలన నిజాలు బయటికొచ్చాయి.

ఓ జంట. సంతానం కోసం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించింది. తన భర్త శుక్రకణాలతో సంతానం కలిగేందుకు అంగీకారం కుదిరింది. దీంతో డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంది. అయితే సదరు మహిళకు సంతానం కలిగింది. కానీ పుట్టిన శిశువుకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో సదరు దంపతులు అనుమానంతో డీఎన్ఏ టెస్టులు చేయించారు. దీంతో శిశువు డీఎన్ఏ తన భర్త డీఎన్ఏతో సరిపోలలేదు. దీంతో ఘోర తప్...