భారతదేశం, జూలై 3 -- బెట్టింగ్ భూతానికి బానిసైన కుమారుడు. కన్న తండ్రిని చంపేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో గచ్చిబౌలిలో వెలుగు చూసింది. తండ్రి గొంతులో కత్తితొ పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పైగా ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటికి వచ్చాయి.

ప్రాథమిక వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఘనపూర్‌ మండలానికి చెందిన కేతావత్‌ హనుమంతు (37) హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. కుటుంబంతో కలిసి గోపనపల్లిలోని ఎన్టీఆర్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం మేస్త్రీగా పని చేస్తున్నాడు. అవసరాల కోసం హనుమంతు రూ.6 లక్షల లోన్‌ తెచ్చాడు.

ఈ డబ్బులను గమనించిన పెద్ద కుమారుడు రవీందర్ నాయక్. ఈ డబ్బును బెట్టింగ్‌ యాప్‌లో పెట్టి పోగొట్టాడు. ఈ డబ్బు విషయంపై కుమారుడిని తండ్రి నిలదీశాడు. తీవ్రంగా మం...