Hyderabad,telangana, జూలై 10 -- హైదరాబాద్‌ లోని ముషీరాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న తండ్రిని కుమార్తె దారుణంగా చంపేసింది. కల్లులో మత్తుమందు కలిపి ఆపై ఉరివేసి హత్య చేసింది. అంతేకాదు సెకండ్‌ షో సినిమాకు వెళ్లివచ్చిన తర్వాత.. మృతదేహాన్ని చెరువులో వేసింది. ఘట్‌కేసర్‌ ఏదులాబాద్‌ చెరువులో మృతదేహం లభ్యమైంద. కూతురు, ప్రియుడు, తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. విచారిస్తున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఘట్‌కేసర్‌ పోలీసులు వెల్లడించారు. ముషీరాబాద్‌ పరిధిలో నివాసం ఉండే వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుండగా. శారద జీహెచ్‌ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు పని చేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

జూలై 6వ తేదీన లింగం ఎప్పటిలాగే సెక్యూరిటీ విధుల కోసంవెళ్లాడు. అయ...