Hyderabad,telangana, సెప్టెంబర్ 7 -- హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనాలు పూర్తి కావొచ్చాయి.11 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా. విగ్రహాల నిమజ్జనం ఆదివారం ఉదయం వరకు కొనసాగింది.

నిమజ్జనానికి శనివారం చివరి రోజు అయినప్పటికీ కొందరు నిర్వాహకులు ఆలస్యంగా ఊరేగింపు ప్రారంభించడంతో ఆదివారం వరకు కొనసాగాయి. ఆదివారం సాయంత్రానికి నిమజ్జన ప్రక్రియ ముగుస్తుందని అధికార వర్గాలు అంచనా వేసినప్పటికీ.. కొన్ని విగ్రహాలు ఆలస్యంగా చేరుకున్నాయి.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో 2.61 లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ ఎంసి) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

నగరంలోని సువిశాలమైన హుస్సేన్ సాగర్ లో 11 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు. పండుగ ప్రారంభమైనప్పటి నుంచి జీహెచ్ ఎంసీ పారిశుధ్య కార్మికులు 1...